Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఆరూరి సహకారంతో మహిళా భవనం నిర్మిస్తా
- స్థానిక సర్పంచ్ మంద సతీష్, సీసీ గోలి కొమురయ్య
నవతెలంగాణ-వర్ధన్నపేట
రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన గ్రామైక్య సంఘాలు గ్రామాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తూనే, పేద మహిళల అబివృద్ధి కోసం వివిధ రకాల సేవలను అందిస్తున్నాయని, కడారిగూడెం గ్రామానికి చెం దిన మహిళలే మండల, జిల్లా సమైక్యలకు వరుసగా ప్రాతి నిధ్యం వహించడం హర్షనీయమని సర్పంచ్ మంద సతీష్ ఇల్లంద క్లస్టర్ కోఆర్డినేటర్ గోలి కొమురయ్య లు గ్రామైక్య సంఘాల పనితీరును అభినందించారు. ఆదివారం వర్ధన్న పేట మండలంలోని కడారిగూడెం గ్రామంలో గ్రామ, మండల సమైక్య అధ్యక్షురాలు చెన్న సమ్మక్క ఆధ్వర్యంలో నిర్వ హించిన 18వ వార్షికోత్సవానికి వారు హాజరై మా ట్లాడారు. అన్ని రంగాలలో చైతన్యవంతులుగా రాణిస్తున్న మహిళలు నెలసరి సమావేశాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారని అతి త్వరలోనే గ్రామములో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహకారంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి కషి చేస్తానని తెలిపారు. జిల్లాలోనే వర్ధన్నపేట మండలంను ముందు వరుసలో నిలుపుటకు ఇక్కడ పనిచేస్తున్న వివో ఏలు, వివో ప్రతినిధులు, సీసీలు, ఏపిఎం చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ వార్షిక మహాసభలో వివో ఏ హైమా వార్షిక నివేదికను సమర్పించారు. ఈ సమావేశంలో మాజీ సమాఖ్య అధ్య క్షురాలు రజిత నాగమణి శారద రజిత కార్యదర్శి కౌసమ్మ వి వో ఏ హైమా అంగన్వాడి టీచర్ భాగ్యమ్మ మాజీ ఫీల్డ్ అస ిస్టెంట్ సంధ్య 24 సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.