Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగరాజు
నవతెలంగాణ-జనగామ
అమాయకులైన గిరిజన ఆదివాసీలపై పోలీసుల దాడి చేయడం అమానుషమని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దూసరి నాగరాజు అన్నారు. ఆదివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సమా వేశం విష్ణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు పాల్గొని మాట్లాడుతూ... అమాయకులైన ఆదివాసీల పై పోలీసుల తీరు ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ బిడ్డఓట్లతో గెలిచి పోడు భూములను పట్టా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విస్మరించారన్నారు. పొట్ట కూటి కోసం పోడు చేసు కుంటున్న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషి గూడెం ఆదివాసీ బిడ్డల పై అక్రమ కేసులు పెట్టి, మహిళలు, చంటి బిడ్డ తల్లులని చూడకుండా వారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈడ్చుకేళ్ళి జైళ్లకు పంపడం అప్రజాస్వామిక చర్య అన్నారు. గుడిసెలను నేలమట్టం చేసి నిలువనీడ లేకుండా చేయడం పాలకుల దుర్మార్గపు కుట్రకు నిదర్శనమన్నారు. అధికార పార్టీ నాయకులు వందల ఎకరాలు కబ్జా చేసినా పట్టించుకోని ప్రభుత్వం, ఆదివాసీలు సాగు చేసుకొంటున్న భూమి మాత్రమే కనిపి స్తుందా అని ప్రశ్నించారు. ఆదివాసీ బిడ్డలకు ప్రజలంతా మద్దతు తెలిపి నిరంకుశ పాలనను అంత మొందించాలని పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ నాయకులు పోత్కనూరి కనకాచారి, కోయాల్కర్ సాయి, మారేడు వినోద్, కనక రాజు, కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు.
గూడూరు : మంచిర్యాల జిల్లాలో కోయపోషగూడ ఆదివాసి మహిళలపై అటవీశాఖ అధికారులు చేసిన దాడి హేయమైన చర్య అని ఆదివాసీి పెద్దమనుషుల సంఘం ఐలబోయిన వీరయ్య అన్నారు. ఆదివారం గూడూరు మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయ కులు దారం బాలరాజు అధ్యక్షతన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వీరయ్య పాల్గొని మాట్లా డుతూ రాజ్యాధికారాన్ని ధిక్కరించి మహిళలపై పోలీ సులు, అటవీశాఖ అధికారులతో దాడులు చేపించడం సిగ్గుచేటన్నారు. సదరు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పూనం జనార్ధన్, దారం నరేష్, తాటి సుధాకర్, వజ్జ ప్రసాద్, పెనుక ప్రభాకర్ ,మూయబోయిన వెంకన్న, పుణ్యం సమ్మయ్య, బత్తుల శ్రీనివాస్, మేడ వెంకన్న, రవీందర్ పాల్గొన్నారు.