Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోష గూడెం గ్రామ ఆదివాసీ గిరిజన మహిళల పై ఫారెస్ట్, పోలీస్ శాఖ అధికారుల దాడి హేయమైన చర్య అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, ఎఐకెఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి తోకల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం మండల అధ్యక్షురాలు బొల్లం సోమక్క అన్నారు. ఆదివారం మండలంలోని వెంకట్రాంపురం దొరన్న స్మారక భవనంలో ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల సమావేశంలో వారు మాటాడారు. మహిళలని చూడకుండా పాశవికంగా ప్రవర్తించారని, ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడినా ఫారెస్టు, పోలిస్శాఖ వారిపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆదివాసీ పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి నేటి వరకు పట్టాల ఇవ్వకపోగా దాడులతు చేయించడం తగదన్నారు. పోడు భూములను ఆక్రమించి హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాల సాగు భూమికి పట్టాలివ్వాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఆదివాసీ పోడు సాగు దారుల పై దాడులు నిలిపేసి అర్హులందరికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామచంద్రుల మురళి, ఈరోజు నరేంద్రాచారి, కన్నెబోయిన లత, గట్టిగొర్ల నర్సమ్మ, సింగ్ ఉపేంద్ర, జక్కుల ఎల్లమ్మ, జంగిలి సుజాత, యల్లబోయిన సారమ్మ తదితరులు పాల్గొన్నారు.