Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి
నవతెలంగాణ-లింగాలఘణపురం
దళితవాడలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం మండలం లోని కళ్లెం గ్రామంలో కేవీపీ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేలో జిల్లా కమిటీ సభ్యు లు గడ్డం యాదగిరి పాల్గొని మాట్లాడారు. కళ్లెం గ్రామంలో బుడగ జంగాల కాలనీలో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బం దులకు గురవుతున్నారని అన్నారు. విద్యుత్ స్తంభాలున్నా సరిపడా విద్యుద్దీపాలు లేవన్నారు. వర్షాకాలంలో నీరు నిలిచి దోమలు వృద్ధిచెంది రోగాలు ప్రబలుతున్నాయని అన్నారు. తాగునీరు సక్రమంగా అందక దూరప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్న పరిస్థితి కళ్లెం గ్రామంలో నెలకొందని అన్నారు. తక్షణమే సర్పంచ్, ఎంపీటీసీ, అధికారులు స్పందించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు లేదంటే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడ తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో. మబ్బు ఉప్పయ్య ముగ్గు పోషయ్య, శిరిగిరి కిష్టయ్య, మబ్బు బిక్షపతి, చిటకొడుర్ పద్మ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.