Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేళ్లకే ఇంటర్ నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
నవతెలంగాణ-కొత్తగూడ
రెండేండ్లకే అసమాన్యమైన ప్రతిభ కనబర్చి ఇంటర్నే షనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించు కున్నాడు ఓ చిన్నారి చిచ్చర పిడుగు. కొత్తగూడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన దాసరి మదూష-అనిల్ రెడ్డి దంపతుల ప్రథమ కుమారుడు మన్విత్ మోక్షరెడ్డి తల్లి వద్ద బగవద్గీత శ్లోకాలు, తెలుగు పద్యాలు, తెలుగు,ఇంగ్లీషు పదాలు, అక్షరాలు అమర్చడం, తెలుగు తిధులు, స్వతంత్ర సమరయోధులను గుర్తించడంలో దిట్ట. కుమారుడి ప్రతిభను గుర్తించిన తల్లి తండ్రులు ఇటీవల హైద్రాబాద్ పట్టణంలో శ్రీ శివరామకష్ణ బజన మండళి, ఇంటర్ నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పోటీలకు తీసుకుని వెళ్లారు. అక్కడ బాలుడి ప్రతిభను చూసిన నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు కల్పిస్తూ అవార్డు ప్రధానం చేశారు. బాలున్ని చిన్న తనం నుండే బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చి దిద్దుతున్న తల్లి తండ్రులను అభినందించారు.వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న బాలుడిని గ్రామ స్తులు, కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు.