Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ యాకూబ్
నవతెలంగాణ-తొర్రూరు
ఇండ్లు లేని నిరుపేదలకు తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డులో ఉన్న దేవాదాయ భూములలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం(వ్యకాస) జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డులో ఉన్న దేవాదాయ భూములను సందర్శించి ఇల్లు లేని నిరుపేదలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించిస్తానని, అర్హులైన భూమిలేని వారికి మూడెకరాల భూమి ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీలను తుంగలో తొక్కి పజలను మోసం చేశాడని విమర్శించారు. మండలంలో అనేకమంది నిరు పేదలు కిరాయి ఇండ్లలో ఉంటూ పెరిగిన ధరలతో ఇంటి కిరాయిలు కట్టలేక, చాలీచాలని బతుకులతో పస్తులు ఉంటూ కాలం వెల్లదిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు నిత్యా వసర సరుకులు, గ్యాస్ పై అధిక ధరలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికభారాన్ని మోపాయన్నారు. స్వరాష్ట్రంలోనూ ఎనిమిదేళ్లుగా ఇండ్లు రాక నిరుపేదలు ఇబ్బందులుపడుతున్నారన్నారు. తొర్రూరు పట్టణంలో ఉన్న దేవాదాయ భూములలో ఇండ్లు నిర్మించివ్వకుంటే పేదలతో ఇండ్లు నిర్మిస్తామని హెచ్చరించారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా అందులో గుడిసెలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. అండగా వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, కెవిపిఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పస్తం భాస్కర్, డోనుక దర్గయ్య, శ్రీను, కిన్నెర లక్ష్మి, ముఖేష్, పస్తం రాణి, పస్తం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.