Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు గుడి ఎదుట సెంటర్లో ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
కురవి మండల కేంద్రంలో శాశ్వత రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కురవి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గుడి ముందు సెంటర్లో గంటపాటు వర్షంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఆపేందుకొచ్చిన పోలీసులతో వాగ్వి వాదం నెలకొండి. ఈ సందర్భంగా పట్ల మధు మాట్లాడుతూ... కొన్నేండ్లుగా రోడ్లు సరిగా లేక ప్రమాదాలు నెలకొంటున్నాయని అన్నారు. స్థానిక ప్రజా ప్రతి నిధులు సమస్యను గలికొదిలేశారని అన్నారు. నాసిరకం రోడ్లు వేస్తూ,ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. నాసిరకం రొడ్లు వేసే పద్దతిని మాను కోవాలని హితవు పలికారు. శాశ్వత రొడ్ల నిర్మాణాన్ని నెల లోపు చెపట్టకుంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు గుగులోత్ నవీన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరెందర్, నవీన్ మండల నాయకులు వాసు, గణేష్, కళ్యాణ్, మహేష్, ప్రవీణ్, ప్రమోద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.