Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లోకి వరదనీరు భారీగా చేరి నిండుకుండలా కన్పిస్తు న్నాయి. ముగ్ధుపురం చెరువు అలుగు పడుతూ పరవళ్లు తొక్కుతుంది. మాధన్నపేట పెద్ద చెరువులోకి వరదనీరు చేరుతూ ప్రస్తుతం 13 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. చెరువు కుంటల్లోకి వరదనీరు చేరుకుంటూ మరో రెండు రోజుల్లో అన్ని మత్తళ్లు పడే అవకాశం ఉంది. ఇప్పటికే చెరువుల ఆయకట్టు కింద నారుమళ్లు సిద్ధం చేసుకొని నాటేసేందుకు రైతులు సిద్ధప డుతున్నారు. డివిజన్ ప్రజలకు గుండెకాయ లాంటి పాకాల చెరువుల్లోకి ఇప్పటికే 25 అడుగుల నీటి మట్టం చేరుకొంది. పాకాల అభ యారణ్యం, కొత్తగూడ అటవీ ప్రాంతం లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పోటెత్తు తున్నాయి. మరో రెండ్రోజుల్లో పాకాలకు వరద చేరుకొనే అవకాశం ఉంది. 30 అడుగుల నీటి మట్ట సామర్ధ్యం కలిగిన పాకాల చెరువు మత్తడికి చేరువకానుంది. భారీ వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నాట్లేసే ఏరువాక పనుల్లో రైతులు సిద్దంగా ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పట్టణంలోని కుమ్మరికుంట, ఎన్టీ ఆర్‌నగర్ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భారీ వర్షాలతో పెరిగే వరద ప్రవా హంతో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ కోరారు. 12వ వార్డు పటేల్‌నగర్ ప్రాంతంలోని పెద్ద కాల్వలోకి వరద నీరు చేరుకుంది. కాల్వలో గుర్రెపుడెక్కలు ఉన్నందున చేరుతున్న నీటితో గండి పడే ప్రమా దం ఉంది. ఈ మేరకు కౌన్సిలర్ ఎండీ. పాషాకు సమాచారం ఇవ్వగా జేసీబీతో కాల్వ లోని గుర్రెపుడెక్కలు తొలగించే చర్యలు చేప ట్టారు. కుమ్మరికుంట లోతట్టు ప్రాంతంలో వరదనీరు చేరకుండా కాల్వల్లోకి మళ్లించారు. పలు వార్డుల్లో డ్రైయినేజీ కాల్వల్లో చెత్తచెదారం పెరిగి పోవడంతో నీరుంతా రోడ్డుపైకి చేరుకుం టుంది. మున్సిపల్ పారిశుద్య కార్మికులు కాల్వల ను శభ్రపర్చే పనుల్లో నిమగమయ్యారు. ప్రధాన రహదారి వెంట మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల కై తవ్వకాలు చేపట్టగా వర్షంతో గుంతలుగా మారి రోడ్డంతా బురదమయంగా మారాయి. పలువురు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై నిలి చిన బురదతో అదుపు తప్పి ప్రమాదాలు ఎదు ర్కొంటున్నారు. వేసవి కాలం సమయం వృథా చేసి కాంట్రాక్టర్ వర్షాలు పడే ముందు తవ్వకాలు చేస్తుండగా బాగుపడిన రోడ్లన్నీ అధ్వాన్నంగా అవతరిస్తున్నాయి. అధికారుల పట్టింపు కొరవ డడంతోనే కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా పనులు చేస్తూ ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం అయ్చేలా చేస్తున్నాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లు దెబ్బతినకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.