Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరావాస కేంద్రాల ఏర్పాటులో అధికారులు
- ప్రమాద స్థాయిని మించి పొంగుతున్న వాగులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
నాలుగు రోజులైనా తగ్గేదేలే అంటున్న వానలు. లక్నవరం చెరువు మత్తడికి చేరువలో ఉండడంతో మండల యంత్రాంగం పునరావాస కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేసుకుం టున్నారు. మండల వ్యాప్తంగా వాగులన్నీ ప్రమాద స్థారు ుని దాటి ప్రవహిస్తున్నాయి. గుండ్లవాగు ప్రాజెక్ట్ రాత్రి నుండి మత్తడి పోస్తోంది. లక్నవరం చెరువు మత్తడి పోసేం దుకు ఒక అడుగు దూరంలో ఉంది. గోవిందరావుపేట నుండి సోమలగడ్డ పోయే లో లెవెల్ కాజ్ వే ఉదతంగా ప్రవహిస్తుండడంతో ఆ గ్రామం నుండి మండల కేంద్రాని కి, చల్వాయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ము త్తాపురం వంతెన వద్ద, మొట్లగూడెం వంతెన వద్ద జం పన్నవాగు ప్రవహిస్తోంది. మొద్దుల గూడెం అమతండా మధ్య వంతెన ప్రాంతంలో గుండ్లవాగు ప్రమాద స్థాయిని దాటి ఉదతంగా ప్రవహిస్తోంది. వంతెన ఉన్నప్పటికిని ముందస్తు చర్యల దష్ట్యా అధికారులు అక్కడ సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించేందుకు నియమించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.
మత్తడి పోస్తున్న గుండ్ల వాగు ప్రాజెక్ట్
మండలంలోని కర్లపల్లి పంచాయతీ పరిధిలోని గుండ్ల వాగు ప్రాజెక్ట్ ఆదివారం రాత్రి నుండి మత్తడి పోస్తుందని రైతులు, సర్పంచ్ ఈక రామంజయ్య తెలిపారు. ప్రాజెక్టు ఏఈ క్రాంతి నిరంతరం ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ ప్రాజెక్టు గతంలో తెగి అపార నష్టం సంభవించడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రాజ ెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ప్రాజెక్టును పసర ఎస్సై సిహెచ్.కరుణాకర్ రావు సోమవారం సర్పంచ్ రామాంజయ, పంచాయతీ కార్యదర్శితో కలిసి పరిశీలిం చారు. అప్రమత్తంగా ఉండాలని కర్ల పెళ్లి ప్రజలకు ఆయన సూచించారు. గ్రామంలోని యువకులు రైతులు కూడా ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గత అను భవం దృష్ట్యా అలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు ఉండాలని అన్నారు.
మత్తడికి చేరువలో లక్నవరం చెరువు
మండల రైతాంగానికి కల్పతరువైన లక్నవరం చెరువు మత్తడి పోసేందుకు అడుగు దూరంలో ఉంది. చెరువులోకి ప్రవహించే వాగు ప్రవాహం ఉధతంగా ఉన్నందున సోమ వారం అర్ధరాత్రి వరకు మత్తడి పోయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్నవరం చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 33 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 32 అడుగులకు నీటిమట్టం చేరుకుందని నీటిపారుదల శాఖ అధికారులు ఏఈలు ఉపేందర్ రెడ్డి, అర్షద్ తెలిపారు. వర్షాలు నిరంతరం కురుస్తుండడం వర దలు అధికంగా ఉండడంతో తగ్గుముఖం పట్టే వరకు లక్నవరం పర్యాటక కేంద్రాన్ని మూసి ఉంచాలని పలువురు కోరుతున్నారు.
పునరావాస కేంద్రం ఏర్పాటులో అధికారులు
లక్నవరం చెరువు ఈ అర్ధరాత్రి లోపు ఏ సమయంలోనైనా మత్తడి పోసిన గోవిందరావుపేట మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయే అవకాశాలు ఉండడంతో ముందస్తుగానే ప్రభుత్వ జూని యర్ కళాశాలలో గదులను శుభ్రం చేసి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక సర్పంచ్ లావుడియా లక్ష్మి జోగనాయక్. కార్యదర్శి ఎంపిఓ శంకర్ పనులు ప్రా రంభించారు. లోతట్టు గురయ్యే ప్రాంత ప్రజలను అప్ర మత్తంగా ఉండాలని ఇంటింటికి తిరుగుతూ వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
పెద్ద చెరువు మత్తడికి గండి
మండలంలోని లక్ష్మీపురం పెద్ద చెరువు మత్తడికి గండి పడింది. లక్ష్మీపురం సర్పంచ్ లావుడియా స్వాతి వాగ నాయక్ వెంటనే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గండిని పూడ్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు సహాయంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఉదతంగా ఉన్నందున గండిని పూడ్చేందుకు సమయం పడుతుం దన్నారు. అయినా ఎలాంటి నష్టం జరగకుండా గండిని పూడ్చివేస్తామని ఏఈ క్రాంతికుమార్ తెలిపారు.