Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి 24వ వార్డులో సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీనియర్ కౌన్సిలర్ మార్నేని వెంకన్న తెలిపారు. సోమవారం వార్డు పరిధి ఇంద్ర కాలనీలోని హెల్త్ సెంటర్లో వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు మందులు పంపిణీ చేశారు. దగ్గు, జలుబు, జ్వరం షుగర్, బీపీ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి డాక్టర్ స్రవంతి రత్నకుమారి ఏఎన్ఎంలు దీన, దయావతి, అశ్విని పరీక్షించి 100మంది రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశాలు కళావతి, విజయలక్ష్మి, రాధిక, రేణుక విజయ, తదితరులు పాల్గొన్నారు.