Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్స్ టీచర్స్ అధ్యక్షుడు రాయిపెళ్లి యాకయ్య
నవతెలంగాణ-తొర్రూరు
ప్రస్తుత పరిస్థితుల్లో మానవ మనుగడకు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కాలుష్య నివారణ తప్పనిసరి అని లయన్స్ క్లబ్ తొర్రూర్ అధ్యక్షులు యాకయ్య అన్నారు. సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రుర్ టీచర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ కాలుష్య నివారణ దినోత్సవంపై స్థానిక కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్లాస్టిక్ నివారణకు, అధిక జనాభా నివారణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ చింతల సురేష్, కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి, చార్టర్డ్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కిషన్ నాయక్,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శైలజ, సోషల్ వెల్ఫేర్ ఇన్చార్జి మమత విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.