Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు ప్రాంతాలకు స్తంభించిన రాకపోకలు
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న అధికారులు
నవతెలంగాణ-ఏటూరు నాగారం(టౌన్)
ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒక పక్క వర్షాలు మరో పక్క వరదలతో గ్రామాలు చిన్నాభిన్నం అవు తున్నా యి. కొన్ని ప్రాంతాలలో. రాకపోకలు స్తంభిం చడంతో బయటకు రాలేని దుస్థితి నెలకొంది. బా హ్య ప్రపంచంతో సంబంధాలు తాత్కాలికంగా తెగి పోయాయి. విద్యుత్ సరఫరా, సెల్ సిగల్స్ లేక అర్థంగానీ పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల్లోనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటున్నారు. ఏటూరునాగారం, కన్నాయి గూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం గ్రామాల ప్రధాన రోడ్లపైకి వరదనీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో ఇతర జిల్లాలు, మండలాల నుంచి కూడా రాక పో కలు స్తంభించాయి. ఏటూరునాగారం గ్రామ పం చాయతీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం ఆటోలో మైక్‌ను ఏర్పాటు చేసి ప్రచారం చేస్తూ అలర్ట్ చేస్తున్నారు.
గోదావరి వద్ద పూజలు
రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద స్థానిక ఎంపీటీసీ అల్లి సుమలత శ్రీనివాస్, మహిళలు గోదావరి తల్లి శాంతించాలని కుంకుమ, పసుపు కొబ్బరికాయలను కొట్టి పూజలు చేశారు. గౌరమ్మలను చేసి జాకెట్ క్లాత్‌పై నిమజ్జనం చేసి వేడుకున్నారు. గోదావరి తల్లి ఉగ్రరూపం లేకుండా శాంతించి వెనుక్కు పోవాలని వేడుకున్నారు. రాంనగర్, రామన్నగూడెం మధ్యలోని జీడివాగుపై గత సంవత్సరమే బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ బ్రిడ్జికు రాంనగర్‌కు మధ్యలో రోడ్డు ఎత్తు తక్కువగా ఉండటంతో ఉప్పొంగిన జీడి వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండగా ప్రజలు బ్రిడ్జి పైనుండి కూడా దాటలేకపోయారు . బ్రిడ్జి నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరద ఉదృతిని సోమవారం ఉదయం జెడ్పీ సీఈవో రమాదేవి, తహసీల్దార్ సంజీవ, ఎంపీడీవో కుమార్, ఎస్సై రమేష్ పరిశీలించారు. వరదలోకి ఎవరు కూడా వెళ్లొద్దని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు. అధికారయంత్రాంగం అప్రమత్తమై ఉందని, అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు సీఈవో తెలిపారు.
గేట్ల పరిశీలన
ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు ఉన్న గోదావరి కరకట్ట గేట్లను ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, ఈఈ జగదీష్‌లు సోమవారం పరిశీలించారు. వరద నీరు గ్రామంలోకి వెళ్లకుండా షట్టర్లను పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు. గ్రామంలోని వర్షపు నీరు, బ్యాక్ వాటర్‌ను గోదావరి వరద తగ్గిన తర్వాత వదిలేస్తామన్నారు. గేట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.