Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్,
- హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీ ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా స్థానిక పీడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పీడీ స్వర్ణలత లేనినకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి గుగు లోత్ సరోజ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలు కార్మికు లేనని, వారు చట్టబద్ధ సౌకర్యాల పరిధిలోకి వస్తారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ నిర్వహించడం విద్యాబోధన కిందికే వస్తుందని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. ఐసీడీఎస్ ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగ న్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి పెండింగ్ టీఏ, డీఏలు ఇవ్వాలని కోరారు. 2018 లో కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలపై పనిభారాన్ని తగ్గించాలని, ఆరోగ్య లక్ష్మి మెనూ పెంచాలని, మినీ వర్కర్స్ కి మెయిన్ వర్కర్ తో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. యూనియన్ జిల్లా నాయకులు సరస్వతి, కనకం సంధ్య, మల్లికాంబ, విజయలక్ష్మి, ఇందిరా, నిరోష, అనిత, భారతి, హైమావతి, నిర్మల పాల్గొన్నారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
జనగామ కలెక్టరేట్ : అంగన్వాడీ టీచర్స్, వర్కర్ల కనీస వేతనం నెలకు రూ.26వేలకు పెంచాలని, టీఏ, డీఏను సకాలంలో అందజేసి, హెల్త్ కార్డులు అందజేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ వర్కర్స్ యూని యన్ జిల్లా కన్వీనర్ మచ్చా శారద పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నెలల తరబడి గ్యాస్ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి జోగు ప్రకాశ్, చుంచు విజెందేర్, దూసరి నాగరాజు, అంగన్వాడీ యూనియన్ నాయకులు రాజ కళ, రాజేశ్వరి, సరిత, విజయ, జరీనా బేగం, వినోద, ఉమా, నాగలక్ష్మి, జయ తదితరులు పాల్గొన్నారు.