Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాట్యుటి సౌకర్యం, వేతనంలో సగం పెన్షన్‌గా నిర్ణయించాలని 2022 ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని అల్ ఇండియా డిమాండ్స్‌డే నిర్వహించాలనే అంగన్వాడీ యూనియన్ అల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వరదల పరిస్థితి సమీక్ష కోసం ములుగు వచ్చిన తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవితకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి కె సమ్మక్క మా ట్లాడుతూ 45వ ఐఎల్‌సి తీర్మానం ప్రకారం కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఏ, డిఏ బిల్లులు ఇవ్వాలని అన్నారు. 2018లో కేంద్రం పెంచిన వేతనాలు ఇవ్వాలని, పిఆర్సి ఏరియర్స్ 3 నెలలు ఇవ్వాలని అన్నారు. ఆరోగ్య లక్ష్మీ మెనూ చార్జీలు పెంచాలని, డబుల్ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని అన్నారు. సెం టర్ అద్దెలు చెల్లించాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే కల్పించాలని, చనిపోయిన వారికి ఖర్చులు కింద రూ.50 వేలు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కె సరోజన, జమునారాణి, మంజుల, నర్మద, దమయంతి, స్వప్న, కల్పన, వెంకటేశ్వర, రుక్మిణి, రాధ, అనిత, రజిత, పాల్గొన్నారు.