Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కళాశాల హాస్టల్ డ్రైనేజీ, వాటర్ సమస్య పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేలోత్ సాయి కుమార్ కోరారు. సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం హాస్టల్ ప్రాంగణంలోని మురుగు నీటిలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నెల రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షాకాలంలో విష జ్వరాల భారీన పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక వార్డెన్ చొరవ తీసుకుని మున్సిపాలిటీ అధికారులకు విన్నవించి సమస్య పరిష్కరించాలన్నారు. డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ మాట్లాడుతూ... సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు తాగునీరు కూడా లేదన్నారు. ఎస్సీ కాలేజ్ హాస్టల్‌కి పక్కా భవనం లేక పెచ్చులు ఊడిపోతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టు కుని విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరిొచాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రంజిత్, వెంకటేష్, సాయి పాల్గొన్నారు.