Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గిరిజన స్త్రీ,శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-ములుగు/ఏటూరునాగారం టౌన్
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గిరిజన స్త్రీ శిశ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా రు. సోమవారం ఏటూర్ నాగారం మండలం రామన్న గూడెం వద్ద గోదావరి వరద ఉధతి వాజేడు మండలం పుసూరు బ్రిడ్జి వద్ద గోదావరి వరద ఉధతిని ఆమె సంద ర్శించి పరిశీలించారు. గోదావరి 16 అడుగుల నుండి 15 అడుగుల వరకు తగ్గుముఖం పట్టిందని 13 లక్షల క్యూ సెక్కుల నీరు పారుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముం దస్తు చర్యలతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలే దన్నారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండా లన్నారు. మురుగునీటి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచించారు. రోడ్ల మీద నీరు నిల్వకుండా ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, ఐటిడిఏ పిఓ అంకిత్, అడిషనల్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్, అశోక్ కుమార్, డిఆర్ఓ కే రమాదేవి, చీప్ ఇంజనీర్ విజయభాస్కరరావులతో కలిసి అన్ని శాఖల అధి కారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వర్ష ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని చెరువులు కుంటలు నిండిపోయాయని, ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తెలిపారు. మంగపేట, రామన్నగూడెం గోదావరి ముంపు గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర సీఎం కర కట్ట నిర్మాణం కోసం రూ.135 కోట్లు మంజూరు చేశారని. పనులు వచ్చే జూన్ మాసం వరకు పూర్తి చేస్తామని అన్నా రు. ఐటిడిఏ ఏటూర్నాగరం కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం బర్ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 850031 5816 ప్రజలు అత్యవసర పరిస్థితిలో కాల్ చేసి సాయం పొందాలని మంత్రి అన్నారు. పోలీస్, రెవెన్యూ పంచాయతీ సిబ్బంది అందరూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు అధికారులు ప్రజా ప్రతిని ధులు సహయ చర్యలో పాల్గొంటున్నట్లు ప్రజలు సహకరించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని విధాల ప్రభుత్వం తరఫున ఆదు కుంటామని ఆమె అన్నారు. ప్రకతి వైపరీత్యాలు సంభ వించిన వెంటనే స్పందించడం కోసం జిల్లా కలెక్టరేట్ లో కాల్ సెంటర్ 1800 - 4250520 ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సమ్మక్క బ్యారేజ్ వద్ద నీరు నిలువ ఉండటం వల్ల లోతట్టు ఉన్న గ్రామాలలో నీరు నిలువ ఉండటం మల్ల అక్కడి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించామని వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేయడం అదేవిధంగా గజ ఈతగాలను స్పీడ్ బోట్లను పోలీస్ సిబ్బందిని భోజనం ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఐటిడిఏ ఏపిఓ వసంతరావు, ఎంపీపీ అంతటి విజయ, జిల్లా రైతు సమితి రైతు సమితి సమన్వయకర్త పళ్ళ బుచ్చయ్య, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, జిల్లా కోఆప్షన్ నెంబర్వల్లి అభి, ఇరిగేషన్ సిబ్బంది, ఆర్అండ్బి ఎస్ఈ, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ, ఐటీడీఏ ఈ ఈ హేమలత జిల్లా పంచాయతీ సిబ్బంది, తహసీల్దార్ సంజీవ, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
సహాయక చర్యలో నిమగమైన అధికారులు
నాలుగు రోజులనుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉధతిని ఎంపీ మాలోత్ కవిత, ఎస్ కష్ణ ఆదిత్య, ఐడీడీఏ పిఓ అంకిత్లతో కలిసి మంత్రి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎప్పట ికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగ కుండా లోతట్టు ముంపు గ్రామాలను అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రామన్నగూడెం వద్ద గోదావరి నది ఉధతిని ముంపుకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.