Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరైన రహదారి లేక ప్రజల ఇక్కట్లు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని ఉమ్మడి గ్రామపంచాయతీ ముప్పారం గ్రామంలో నూతనంగా ఏర్పడిన సీఎం పెద్దతండ పరిధి రేగడి తండాలో సుమారు 54 కుటుంబాలు సుమారు 300 మంది ప్రజలు ఉన్నారు. వారి పిల్లలు చదువుకోవడం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. సరై రోడ్డు లేకపోవడంతో తండావాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తుల నిమిత్తం నిత్యం వెళ్లే రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయమైంది. ఒక్కో చోట మోకాళ్ళ లోతు వరకు బురదనీరు చేరుకుంది. దీంతో రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తండావాసులు వాపో తున్నారు. తండా నుండి ముప్పారం గ్రామానికి కిలోమీట రన్నర దూరం చేరుకోవడానికి నరకయాతన పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే వారి వ్యవసాయ పనులు చేసుకునేందుకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేదు. అలాగే కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాద్ ప్రాంతాలకు పంటలను తీసుకెళ్లడానికి సరైన రోడ్డుయ లేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు, పాలక వర్గం, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పటించుకోవట్లేదు. తక్షణమే రోడ్డు పనులకు మరమ్మతులు చేపట్టాలని తండావాసులు కోరుతున్నారు.
తండాకు మెరుగైన రోడ్డు ఏర్పాటు చేయాలి
సీఎం పెద్దతండ గ్రామపంచాయతీ శివారు తండా రేగడితండా కు సరైన రోడ్డు మార్గం లేదు. చిరుజల్లులకే బురదమయంగా మారుతోంది. రోడ్డుపై బురద గుంటలో పడి ప్రమాదాలు జరిగే వీలుంది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మార్గం కల్పించాలి.
-అజ్మెరా మురళి, రేగడితండ
తండాకు కనీస సౌకర్యాలు కల్పిచాలి
ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు తండా రోడ్డు బురదమయంగా మారింది. దీంతో రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. తండావాసులకు రోడ్డుసౌకర్యంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలి.
- బానోతు వెంకన్న, రేగడితండ