Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని చీటకోడూరు రిజర్వాయర్ ను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధి కారులు అందు బాటులో ఉంటారని ఎప్పటికప్పుడు సమా చారాన్ని అందించాలన్నారు. అదనపు కలెక్టర్ భాస్కరరావు, జనగామ తాసిల్ధార్ రవీందర్ పాల్గొన్నారు.