Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఆందోళనకు గురి కావద్దని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. మండలంలోని సముద్రాల గ్రామానికి వెళ్లే దారిలో మైసమ్మ బావి వరుసగా కురుస్తున్న వర్షాలకు కంగిపోయి రహదారి పూర్తిగా ధ్వంసమైతే జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి అధికారులను అప్రమత్తం చేసి, బావిని పూర్తిగా పూడ్చేందుకు పనులను చేపడుతున్న క్రమంలో జరుగుతున్న పనులను మంగళవారం ఎమ్మెల్యే రాజయ్య పర్యవేక్షించి మాట్లాడారు. ప్రమాదకరంగా ఉన్న బావిని పూర్తిగా పూడ్చి, గ్రామానికి అవసరమైన దారికోసం స్టాండింగ్ ఛైర్మన్ రవి చొరవతో త్వరితగతిన జరుగుతున్న పనులపట్ల ప్రజలంతా గుర్తు చేసుకోవాలని అన్నారు గ్రామాభివద్ధికి సహకరిస్తూ ఆ స్థలాన్ని అప్పగించిన బావి యజమానిని కూడా అభినందించారు. ముఖ్యంగా వర్షకారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ క్రిష్ణవేణి, డీఆర్డీఓ రాంరెడ్డి, ఐబీ డీఈ రాజగోపాల్, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, తహసీల్దార్ పూల్ సింగ్, ఎంపీడీఓ కుమారస్వామి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, రంగు హరీష్, చిగురు సరిత, ఆర్ ఐ కపాకర్ రెడ్డి, సర్పంచ్ గుండె విమల నర్సయ్య, ఎంపిటిసి పడిశాల సుగుణ వెంకటేష్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.