Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీటి ఉధతి పెరిగిందని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని పరకాల ఏసీపీ శివరామయ్య కోరారు. మండల కేంద్రంలోని కొప్పుల జోగంపల్లి గ్రామాల మధ్య చలివాగు డ్యామును, పంప్ హౌజ్‌ను మంగళవారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొప్పుల జోగంపల్లి గ్రామాల మధ్య డ్యామ్‌పై నుంచి ఉదతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వసంతాపూర్-కొప్పుల నడుమ రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. ప్రజలందరూ ప్రవహించే నీటిలో కల్వర్టులు దాటవద్దని, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. జాగ్రత్త చర్యలను తెలిపారు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టాక రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఆయన వెంట పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు పాల్గొన్నారు.