Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
మండలంలోని పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు భారీగా కురుస్తుండటంతో ముంపు ప్రమాదం ఉందని తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు. మండలంలోని కమలాపూర్, మున్సిపల్ పరిధిలోని పలు ముంపు ప్రాంతాలను మంగళవారం ఆయన సందర్శించారు. ముంపు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి రెండు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తాకవద్దని సూచించారు. అనంతరం కమలాపూర్‌లోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందిస్తున్న ఆహారాన్ని, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ రామస్వామి, వీఆర్వోలు పాల్గొన్నారు.