Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణిలో 2021-22 ఆర్థిక సంవత్సర లాభాల వాటా ప్రకటించాలని సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో 2021.22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్మి కుల కష్టార్జితం లాభాల వాటా ఇంతవరకు ప్రకటించకపోవడం చూస్తే కేసిఆర్ ప్రభుత్వం మరోసారి కార్మికులను మోసం చేయాలని చూస్తున్నట్టు కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. 2022 మార్చినాటికి ఎన్ని లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామో వెంటనే చెప్పినటువంటి సింగరేణి సి అండ్ ఎండి ఇంతవరకు లాభాలు ప్రకటించకపోవడం అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు తెలిపారు. లాభాల వాటా గురించి గెలిచిన సంఘాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వాటా గురించి కార్మికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, ఎన్నికల సమయం దాటిపోయినా ఇంతవరకు ఎన్నికలు పెట్టకకపోవడానికి కారణం ఇప్పుడు అర్థమౌతున్నదని,ప్రస్తుతం గెలిచిన సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎంత అనుకూలంగా ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. కార్మిక సమస్యలపై ప్రాతినిధ్య, గుర్తింపు సంఘాలు తప్పించుకొని తిరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా బాధ్యతగా గెలిచిన సంఘాలు కార్మికుల సమస్యలు పట్టించుకోని లాభాల వాటా ఇప్పించాలని, లేని పక్షాన కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజెందర్, బ్రాంచ్ నాయకులు బొడ్డు అశోక్, రాజయ్య, రవికిరణ్, సంది జనార్దన్, గట్టు రాజు, బాలు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.