Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
- వర్షంలోనూ పర్యటన, పలువురికి పరామర్శ
నవతెలంగాణ-రఘునాథపల్లి
భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను ఆదుకుంటా మని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. వర్షంలోనూ మండలంలోని మల్లంపల్లిలో మంగళవారం ఆయన పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. ఇల్లు కూలిపోయిన కుటుంబాలను ఆదుకోవడంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులు ఆందోళన చెందవద్దని సూచించారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు ఉండవద్దని, సురక్షిత పాంతాలకు వెళ్లాలని చెప్పారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రామిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల సమన్వయకర్త మట్లపల్లి సునీత, సోషల్ మీడియా ఇన్ఛార్జి తిప్పారపు రమ్య బాబురావు, కంచనపల్లి ఎంపీటీసీ కేమిటి రమ్య రాజు, తహసీల్దార్ అన్వర్, ఎంపీడీఓ ఆసిన్, ఎంపీటీసీ బోల్లపల్లి సరోజినీ వెంకటస్వామి, మండల ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజరు, తదితరులు పాల్గొన్నారు.