Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలదిగ్బంధంలో 100 పడకల ఆస్పత్రి
- చినుకు పడితే వరద కష్టాలు
- పట్టించుకోని జిల్లా ఉన్నత అధికారులు
నవతెలంగాణ-భూపాలపల్లి
పేద రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆస్పత్రిని నిర్మించింది. కానీ చినుకు పడితే రోగులకు వరద కష్టాలు ఎదురవుతున్నాయి. ఆస్పత్రికి వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆస్పత్రి జలదిగ్భంధంలో చిక్కుకుంది. మార్గం లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 11 మండలాల ప్రజలకు ఎదైనా పెద్ద జబ్బు చేస్తే వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాల్సిందే. నూతన జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 100 పడకలతో అధునతన సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు 10,మే 2015లో శంకుస్థాపన చేశారు. మూడు సంవత్సరాల తర్వాత కొంత తాత్కాలిక సేవలను అందించారు మాత శిశు సంక్షణ కేంద్రంగా ఈ ఆస్పత్రిలో ప్రసవా ల సేవలను ప్రారంభించి ప్రసూతి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రస వసేవలకు నిత్యం 30 నుండి 40 మంది ఓపికి వస్తున్నా పాటు అటెండెంట్స్, సిబ్బంది ఆస్పత్రి లోనిత్యం ఉంటున్నారు.
మే 9న అధికారికంగా ప్రారంభోత్సవం...
ఈ క్రమంలో మే 9న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్లో మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తో కలిసి జిల్లాలో రూ.10కోట్లతో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో రూ. 41కోట్ల 80లక్షల అంచనాతో నూతన జిల్లా ఆస్పత్రి భవనం, రూ. 15 కోట్ల అంచనాతో 50 పడకల సమీకత ఆయుష్ వైద్యశాల నిర్మాణాలకు 25లక్షలతో నూతన డయాగ్నోస్టిక్ హబ్ భవన శంఖుస్థాపన, రూ.29కోట్ల 4 6లక్షలతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రి భవనం, రూ. 11లక్షలతో ఏర్పాటు చేసిన పాలియేటివ్ సేవా కేంద్రం ప్రారంభోత్సవం, రూ.16లక్షల 60 వేల అంచనాతో కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీ, రూ.54 లక్షలతో 20 పడకల పిల్లలు ప్రత్యేక సంరక్షణ విభాగం. రూ. 3లక్షల 65 వేల అంచనాతో ఎన్సీడీ క్లినిక్ పునరుద్ధరణ పనులు శంఖుస్థాపనలు, రూ.46 లక్షలతో నిర్మించిన అక్షయ కేంద్రం ప్రారంభో త్సవాలు చేశారు. అయితే ఆసుపత్రి ప్రధాన రహదారికి మాత్రం నిధులు కేటాయించకపోగా ఆ విషయాన్ని మరచి పోవడం గమనార్హం.
వైద్య సదుపాయం ఉన్న రహదారి లేక..
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రసూతి వైద్యసీ వలకు ప్రజలు చేరువవుతున్న తరుణంలో ఆస్పత్రికి రహదారి కష్టాలు మొదలయ్యాయి. భూపాలపల్లిలో తుమ్మల చెరువు పక్కనే కలెక్టరేట్ సముదాయ భవనాలు నిర్మిస్తున్నారు. దీంతో చెరువు సామర్ధ్యం నిండితే ఈ భవనాలు నీట మునగా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వర్షానికి తుమ్మల చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంతం అంతా జలదిగ్బందంలో చిక్కుకుంది. కోట్లాది రూపా యలు ఖర్చు చేసి భవనం నిర్మించినా అందులోకి వెళ్లే రహదారులను సక్రమంగా ఏర్పాటు చేయలేదంటే అందుకు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనప డుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. వర్షానికి వరద నీరు పోటెత్తడంతో ఆస్పత్రి చుట్టు నీరు చేరి చెరువును తలపిస్తుంది. ప్రధాన రోడ్డునుండి ఆస్పత్రి ప్రధానగేటు పూర్తిగా జలదిగ్బందంలో చిక్కుకుపోయింది. దారివెంటసుమారు 50 మీటర్ల పొడవులో, 6పీట్ల మేరానీరు నిలిచింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న వారు బయటకు, ఆస్ప త్రికి వచ్చే వారు లోనికి రాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ప్రత్యమ్నాయంగా ఆస్పత్రి ఎదురుగా దారినుండి కొందరు ఆస్పత్రిలోకి వెళ్తున్నారు. గతేడాది కూడా వర్షాలకు ఆస్పత్రి ఆవరణ జలమయం అయింది. అయినా అధికారులు మాత్రం స్పందించలేదు. ఆస్పత్రి ప్రారంభమై ప్రస్తుతం మళ్లీ అదే సంఘటన పునరావతం అయినా గ్రహించడంలే దంటే వారి అంతస్వం కనిపిస్తుందని పలువురు అభిప్రా యపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అది కారులకు స్పందించి రానున్న రోజుల్లో పెద్ద ఆస్పత్రికి వరద నీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టి శాశ్వత రోడ్డు మార్గం కల్పించి రవాణా సౌకర్యం మెరుగుపర చాలని సిబ్బంది, జిల్లా ప్రజలు కోరుతున్నారు.
శాశ్వత రోడ్ మార్గానికి పనులు చేపడతాం
ఆకుల సంజీవయ్య, సూపరింటెండెంట్
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆసుపత్రికి దారి లేకుండా పోయింది. అంబులెన్స్ సైతం లోపలికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లాము. ఆస్పత్రిలో సుమారు 30 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. తాత్కాలికంగా ఆస్పత్రి ఎదుట ఉన్న గేటు ద్వారా రాకపోకలను సాగిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే శాశ్వత రోడ్డు నిర్మాణ పనులను చేపడతాం.