Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నవతెలంగాణ-హసన్‌పర్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుపై నమ్మకంతోనే టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. మండలంలోని అర్వపల్లి నుంచి కాంగ్రేస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును ప్రజలు విశ్వసిస్తున్నారని అందుకు పార్టీలో పెరుగుతున్న చేరికలే అందుకు నిదర్శనమన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బీజేపీ గ్రామాశాఖ అధ్యక్షు మెడిపల్లి రజినీకాత్, బీజేపీ యూత్ అధ్యక్షుడు జట్టి శివకుమార్, కందల అనిల్, కొయ్యాడ రాజేష్, గుడపు శశికుమార్, కడారి భరత్, బైరాగోని పవన్, కందల మహేష్, పడేదాల దేవేందర్, మాల కుల పెద్దమనిషి కడారి శంకర్, కడారి రవి, మైనారిటీ యూత్ సభ్యులు షేక్ మదర్, మొగల్, హుసైన్, బడిషబ్, ఖాదర్, మౌలాన్లతో పాటు పార్టీలో చేరిన కార్యకర్తలకు, నాయకులకు భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండి రజనీకుమార్, సర్పంచ్ తగరం జెన్నయ్య, పీఏసీఎస్ చైర్మెన్ జక్కు రమేష్‌గౌడ్, రైతు బందు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజరుకుమార్, మండల కోఆప్షన్ మెంబర్ షేక్‌లాల్, ఉపసర్పంచ్ గట్టు శివకుమార్, తగరం చిరంజీవి, బీసీ సెల్ అధ్యక్షుడు రామ్‌లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.