Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు
- వాగులు దాటలేని స్థితిలో అధికారులు
నవతెలంగాణ-ఏటూరునాగారం (టౌన్)
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వా గులు, పొంగుతుండడంతో సుమారు పది గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తునాన్నారు. భారీ వర్షాలకు కొత్తూరు సర్వాయి, షా పెళ్లి, కొండాయి, ఐలాపూర్ ఆకుల వారి ఘనపుర్, చల పాక బాలాజీ బంధం ఇతర గ్రామాలను వరద నీరు చుట్టు ముట్టింది. తాగడానికి సరైన నీరు లేదు. కరెంటు లేదు. రాకపోకలు లేవు. ప్రజలు కష్టాల కడలిలో మునిగారు. భారీ వర్షాలకు వచ్చిన వరదలతో మండలానికి వచ్చిపోయే గ్రామాలకు రవాణా స్తంభిం చిం ది. వర్షపు నీటినే పట్టుకొని వంట చేసుకోవడం, తాగడానికి వాడు కుంటున్నారు. మండలంలోని కొండాయి, మల్యాల గ్రామాల చుట్టూ జంపన్నవాగు వరద చేరింది. వరదను దాటి రాలేని పరిస్థితి నెలకొంది. దళిత కాలనీ లో వరద నిల్వ ఉండడం వల్ల ఇంటి మట్టిగోడలు కూలి నీటి పాలయాయ్యి. ఆ ఇండ్లు ఉప్పుడు కూలుతాయోనని బిక్కుబి క్కు మంటు గడుపుతున్నారు. సహాయక చర్యలు ఏమాత్రం అందడం లేదని ప్రజలు వాపో తున్నారు. అలాగే నాగు లమ్మ ఒర్రె, జంపన్నవాగు ఉప్పొంగడంతో ఎలి శెట్టిపల్లి, వీరాపురం, అల్లంవారి ఘణపురం, బన్నాజీబంధం, కొత్తూరు, చెల్పాక గ్రామాలకు రవాణా పూర్తిగా స్తంభించింది. కనీసం కరెంటు లేకపోవడంతో చీకటిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కరెంటు లేదని తెలుసుకున్న ట్రాన్స్కో అధికారులు ఆ గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వాగులు, ఒర్రెలు దాటనివ్వడం లేదని వెనుదిరిగి వచ్చారు. ఇలా ఆ గ్రామాలు ఇంకా వరదలోనే మగ్గుతున్నాయి. సెల్ఫోన్ సిగల్స్ లేక సమాచారం రాని దుస్థితి నెలకొంది. గ్రామాల్లోని ప్రజలు వాగునీటిని కూడా తాగలేని పరిస్థితి నెలకొంది.
తమకు సాయం చేసే వారులేరా
- రమేశ్ ఎలిషెట్టిపల్లి
వాగులు, వంకల్లోనే మగ్గిపోవాలా, కనీసం పడవులు కూడా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఉండడం బాధాకరం. కనీసం నిత్యా వసర సరుకులు కూడా లేక అవస్థలు పడుతున్నాం. వాగులు దాటలేక ఇళ్లకే పరిమితమయ్యాం. మా గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు.