Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పస్తులుంటున్న రోజు వారీ కూలీలు
- పదివేల మంది కార్మికుల కూలీలకు కష్టం
నవతెలంగాణ-మహబూబాబాద్
వరుసగా కురుస్తున్న వర్షాలు పేదలను వెంటాడుతున్నాయి. కార్మికులను ఆకలి కేకల్లోకి నెట్టివేశాయి. కూలీల బతుకులను దుర్భరం చేశాయి. చిరువ్యాపారులకు ఇల్లు గడవడం లేదు. దినసరి కూలీల బతుకులు ఉపాధి దొరకడం లేదు. ప్లాట్ ఫారం వ్యాపారులు పని లేక అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పదివేల మంది కూలీలు కార్మికులు ఆకలికేకల్లోకి నెట్టు వేయబడ్డారు. మానుకోట పట్టణ శివారులో ఉన్న 70 కాలనీల్లో బురదమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 461 గ్రామాల్లో నూతనంగా ఏర్పడిన తండాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. మున్సిపల్ కార్మికులు శక్తివంచన లేకుండా స్థానిక సంస్థలలో తమంత కృషి చేస్తున్నారు. శివారు కాలనీలో నీళ్లు తొలగించేందుకు అపరిశుభ్రత తొలగించేందుకు కాలువల పేరుకుపోయినా చెత్త తీసి ప్రవాహాన్ని కొనసాగించేందుకు నానాయాతన పడుతున్నారు. ప్రతిరోజు సుమారు 250 నుంచి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తం గా వందల కిలోమీటర్లు కొట్టుకుపోయాయి అంతర్గత రహదారులు బురద మయంగా మారాయి. కాలనీరోడ్లలో అపరిశుభ్రత చెత్తాచెదారం పేరుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 10వేలకు పైగా కార్మికులు కూలీలు ఉపాధి లేక పస్తులుండే పరిస్థితి నెలకొంది. భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు రిక్షా కార్మికులు ఆటో డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు కొబ్బరి బొండాలు, తోపుడు బండ్లు చిరువ్యాపారులు వర్షం మూలంగా బయటికి రాలేక ఇంట్లో ఉండలేక చేతి లో డబ్బులు లేక రోజువారి పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహా ల్లోని విద్యార్థులు చలికి వణుకుతూ ఇంటికి వెళ్లలేక పాఠశాలలో ఉండలేక అవస్థలు పడుతున్నారు. అధికారులు ఇప్పటివరకు ఎలాంటి పునరావాస కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు.