Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ కార్యాలయాలు జలమయం
- అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-చిట్యాల
మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో రోడ్డుపై నీరు నిలిచి ఇండ్లలోకి ప్రవహిస్తున్న వైనం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గతంలో పలు సందర్భాల్లో అధికారులకు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టడంతో మళ్లీ భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంతోపాటు రైతులకు సంబంధించిన వ్యవసాయ సహకార బ్యాంకు గోదాంపాటు చుట్టుపక్కల ఇండ్లలోకి నీరు చొరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి మండల కేంద్రంలో నెలకొంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతుల కోసం ఏర్పాటు చేసిన గోదాం ప్రభుత్వ కార్యాలయాలు సరైన దారి లేక వరద నీటిలో మునిగాయి. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడారు. జిల్లా అధికారులు స్పందించి తక్షణమే సైడ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.