Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జెడ్పీ చైర్మన్ జగదీశ్వర్
నవతెలంగాణ-ములుగు
పరిపూర్ణ గ్రామ స్వరాజ్యం సాధించడం కోసమే జెడ్పీ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పవర్ ఇచ్చిందని జెడ్పీ చైర్మన్ జెగదీశ్వర్ అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ములుగు అభివద్ధి నిధులను ఖర్చు చేయుటకు ప్రభుత్వం కల్పించిన చెక్ పవర్‌ను వినియోగిం చుటలో భాగంగా మంగళవారం జెడ్పీ కార్యాలయం లో జెడ్పీ చైర్మన్ డిజిటల్ సంతకం ప్రక్రియను పూర్తి చేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించి అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు అవకాశం ఉంటుందని జెడ్పీ చైర్మన్ అన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
జెడ్పీ చైర్మన్‌కు ఘనస్వాగతం
ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌కు ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఘన స్వాగతం పలికారు. అమెరికాలోని వాషింగ్టన్లో ఆటా మహాసభలలో పాల్గొని తిరిగి తెలంగాణకు విచ్చేసిన సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ను హన్మకొండలో మర్యాద పూర్వకంగా కలిసి గులాబీ మొక్కను బహూకరించి స్వాగతం పలికారు.
సహాయక చర్యలలో పాల్గొనండి
మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురు స్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలో ఎటువంటి ధన, ప్రాణ నష్టం కలగకుండా సహాయక చర్యల్లో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొ ని ప్రజలకు బాధ్యతగా సేవలందిం చాలని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. మంగళ వారం జెడ్పీ కార్యాలయంలో ఆయన వివిధ మండ లాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సమస్య తీవ్రత ఎక్కువగా వున్నచోట తన దష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సూడి.శ్రీనివాస్ రెడ్డి, దుర్గం రమణయ్య, పంచాయతీ రాజ్ ఏఇ అజిత్, టిఆర్ఎస ్మండల అధ్యక్షుడు, యువజన విభాగం నాయకులు బాదం ప్రవీణ్, బైకని సాగర్, గోవిందు నాయక్, తుమ్మ మల్ల రెడ్డి, వలీబాబా, ముడతనపెల్లి మోహన్, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.