Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ముంపునకు గురైన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సాఆర్టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిని, మోరంచ వరద ఉధృతిని, చెల్పూర్ బస్టాండ్‌తోపాటు గ్రామ ప్రధాన రహదారిని మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని బతుకుతున్నారని తెలిపారు. వంద పడకల ఆస్పత్రికి ప్రధాన దారి లేక రోగులు, వారి సంబంధీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాలోని అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో చెరువులు, వాగుల, ప్రాజెక్టుల నీటి నిలువల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోరంచవాగు ఉదతంగా ప్రవహిస్తున్న క్రమంలో ముంపు గ్రామాల బాధిత కుటుంబాలతోపాటు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రవీందర్, ప్రణయ్, రాజు, రమేష్, చిరంజీవి, నవీన్ తదితరులు ఉన్నారు.