Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
బల్దియా మకుటంలో మరో కలికితురాయి చేరింది. కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ జాబితాలో నగరానికి చోటు దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అనుసరిస్తున్న శాని టేషన్ సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేశారు. నగరానికి ఓడీఎఫ్లో సర్టిఫికెట్ దక్కడం పట్ల నగర మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. బల్దియా పరిధి ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, సౌకర్యాల ఏర్పాట్లతో పాటు మురుగు నీరు శుద్ధీకరణలో చేపట్టిన విధానాలు, ఇండ్ల నుండి మలాన్ని సేకరించడానికి బల్దియా నుండి సెప్టిక్ ట్యాంక్ లకు అనుమతులు మంజూరు చేసి మానిట రింగ్ చేస్తూ అవలంబిస్తున్న విధానాలను పరిగణ లోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నగరాన్ని ఎంపిక చేసి సర్టిఫికెట్ అందజేస్తున్నదని తెలిపారు.