Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనుల ఆరాధ్యంగా జెడ్పీటీసీ పాయం రమణ
నవతెలంగాణ-వెంకటాపురం
వెంకటాపురం జెడ్పీటీసీ పాయం రమణ పురుషుల కంటే మహిళలు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. గోదావరి వరద స్థితిని అర్ధరాత్రి వేళ సైతం గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ వారి ఆరాధ్యంగా నిలుస్తున్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో నీరు పెరిగి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ఏజెన్సీ జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇండ్ల చుట్టూ వరద నీరు చేరి ప్రజలు తీవ్రబ్బందులు పడుతున్నారు. గోదావరి వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు అవగాహన కల్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులతో కలసి తన వంతు సాయం అందిస్తున్నారు. మండలంలోని పాత్రాపురం వద్ద ప్రధాన రహదారి మూడ్రోజులుగా నీటమునగడంతో ప్రమాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పాత్రాపురం వద్ద నాటుపడవలో తరలించాల్సి వచ్చింది. పడవ నుంచి 108 వాహనంలోకి మహిళను తీసుకెళ్లడంలో జెడ్పీటీసీ పాయం రమణ చొరవ చూపారు. తనే స్వయంగా గర్భిణిని తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆమె గిరిజనుల ఆరాధ్యంగా మారారు. వరద బాధితులకు అన్ని తానై సేవలు అందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు.