Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- గ్రామాలు జలమయం
- స్తంభించిన రాకపోకలు
- ఎమ్మెల్యే సీతక్క పరిశీలన
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగడంతో గోదావరి గురువారం ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని రామన్న గూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 5 గంటలకు గోదావరి వరద నీటిమట్టం 17 వేల 430 మీటర్లకు చేరుకుంది. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గోదావరి సమీపంలోని ఓడ వాడ, ఎస్సీ కాలనీలను ముందస్తుగానే ఐటీడీఏ క్రాస్ రోడ్డుకు తరలించి వైటీసీ కేంద్రం, ఇతర ప్రభుత్వ భవనాల్లో వసతులు కల్పించారు. ఏటూరునాగా రానికి సమీపం నుంచి ప్రవహించే జంపన్న వాగు ఉరకలేస్తూ గోదావరి వరదకు తగలడంతో వాగు వరద వెనక్కితన్ని మండల కేంద్రంలోని శివాలయం, ముత్యాలమ్మ వీధి, బ్రహ్మంగారి వీధి, రామాలయం వీధుల గుండా వరదలు ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రంలో పలు వీధుల్లోకి వరదనీరు చేరుతుండడం తో ప్రజలు రక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎగువ ప్రాంతాల్లోని కడెం, మేడిగడ, కన్నెపల్లి, పార్వతి, సరస్వతి ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో అధికారులు ప్రాజెక్టుల సేఫ్టీ కోసం గేట్లను తెరవగా వరద ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగానే వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ముళ్లకట్ట, రాంపూర్, రామన్నగూడెం, రాంనగర్ పూర్తిగా గోదావరి వరదల్లో చిక్కుకోవడంతో 30 సహాయక బందాలు ఆయా గ్రామాల ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. షాపల్లి, కొత్తూరు, సర్వాయి, కొండాయి, ఐలాపూర్, అల్లంవారి ఘన్పూర్, చల్పాక, బానాజీబంధం, తదితర గొత్తికోయగూడేలు వారం రోజులుగా జలదిగ్బంధంలోనే మగ్గుతున్నాయి.
జిల్లా కలెక్టర్ పరిశీలన
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్, ఏఎస్పీ అశోక్‌కుమార్, ఎంపీపీ విజయ, టీఆర్ఎస్ కోఆప్షన్ సభ్యురాలు వలియాబి, రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైద్య శిబిరాల ఏర్పాటు
ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారుల బందాలు సేవలు అందిస్తున్నాయి. పునరావాస కేంద్రాలకు తరలించిన వారిని కూడా ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు కలిసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఏటూరునాగారంలో వైటీసీ, జెడ్పీఎస్ఎస్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
పునరావాస కేంద్రాల్లో ఎమ్మెల్యే సీతక్క పరిశీలన
పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే సీతక్క సంద ర్శించి బాధితులను పరామర్శించారు. వసతులపై అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, బోజన సదుపాయాలు మెరుగ్గా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.