Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి
నవతెలంగాణ-సంగెం
పేద ప్రజల సంక్షేమానికి పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలానికి చెందిన పద్నాలుగు మంది, గీసుగొండ మండలానికి చెందిన నలుగురికి, గ్రేటర్ వరంగల్ మండలాని చెందిన ఆరుగురికి మొత్తంగా 24మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.12లక్షల15 వేల500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం హనుమకొండలోని ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రాలలో అమలు కావడం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగెం జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు కందకట్ల నరహరి, సర్పంచులు గుండేటి బాబు, సట్లరాజు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.