Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద నీటిలో ఆందోళన
నవతెలంగాణ-గార్ల
తక్కువ ఎత్తులో ఉన్న పాకాల చెక్ డ్యాం పై హైలెవెల్ బ్రిడ్జి పనులను తక్షణమే ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల పరిధి రాంపురం చెక్ డ్యాం వరద నీటిలో నిలబడి గురువారం అందోళన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ ఎత్తులో గతంలో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యాం వరదల వల్ల ఏండ్లుగా 15 గ్రామాల ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారని అ న్నారు. గతంలో అనేక మంది చెక్ డ్యాం వరదలలో కొట్టుకు పోయి ప్రాణాలు కోల్పోయారని, అనేక వాహనాలు వరద ల్లో మునిగిపోయిన సంఘటనలు ఉన్నాయని అందోళన వ్యక్తం చేశారు. పాలకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల సందర్భంలో అనేక హమీలిచ్చి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయ డంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎంపి కవితా, ఎమ్మెల్యే హరిప్రియాలు అనేక సార్లు హామీలు ఇచ్చా రని, ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభించ లేదని విమ ర్శించారు. ఇటీవల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించి సర్వే ల పేరుతో మభ్యపెట్టి కాగితాలకే పరిమితం చేశారని అన్నారు. తక్షణమే హై లెవెల్ బ్రిడ్జి పనులను చేపట్టాలని, లేదంటే దశల వారీగా అందోళన లు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు కందునూరి కవిత, భూక్య హరి, ఎం గిరిప్రసాద్, జి రాజారావు, వి వెంకటేశ్వర్లు, గోవింద్, ఎ వీరా స్వామి, ఎ సత్యవతి, ఎల్లయ్య, బి ఉపేందర్,బి లోకేశ్వరావు, వి కొండయ్య, ఎస్ వెంకటేశ్వర్లు, రామకష్ణ, రజాలి, వీరభద్రం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.