Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
అర్హులైన దళితులకే దళితబంధు ఇవ్వాలని, గ్రామసభలో ఎంపికచేసిన నిరుపేద దళితులకే ఇవ్వాలని అఖిల పక్షం నాయకులు కోరారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మేడ ఎల్లయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పెద్ది కష్ణ మూర్తి ,సీపీఐ(ఎం) ఏరియా కార్యదర్శి సింగారపు రమేష్, ఎన్ఐబీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చింత ఏకలవ్య పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో గ్రామసర్పంచ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామసభ నిర్వహించి దళితబంధు లబ్ధిదారులను ఎంపికచేయాలని అన్నారు. టీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలకు, పార్టీ అనుబంధనాయకులకు కాకుండా నిరుపేద దళితులను గుర్తించి ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలలో ఇంతకుముందే ప్రభుత్వం నుండి సబ్సిడితో పోందిన యంత్రాలను లబ్దిపొందిన వాళ్ళను ఎంపికచేయొద్దని అన్నారు. దళితబంధు పథకం అమలు పారదర్శకంగా ఉండాలన్నారు. సోమవారం ప్రతి పక్షాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జీడి ఎల్లయ్య ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పడమటింటి నర్సింహ్మ, వివిధ పార్టీల నాయకులు బెజగం ఎల్లయ్య, కాసరపు మాధవరెడ్డి,భువనగిరి యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.