Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
వరి సాగులో రైతులు నూతన సాంకేతిక వైపు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి సూచించారు. మండలం లోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో భద్రాచలం ఐటీసీ-ఎంఎస్కే వారి సహకారంతో ఎఫర్ట్ సంస్థ, మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆదర్శ రైతు సంఘం రైతులు డ్రమ్ సీడర్తో వెదజల్లే పద్దతిలో వరి సాగు కార్యక్ర మం గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... వెదజల్లే పద్ధతిలో ఎకరానికి కేవలం 10 కేజీల వరి విత్తనం సరిపోతుందని, 25 రోజుల నుండి 30 రోజుల సమయం ఆదా అవుతుందన్నారు. తద్వారా రైతుకు కూలీల ఖర్చులు, విత్తన ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. విత్తనం విత్తిన ఐదు రోజుల లోపు కలుపు నివారణ కోసం 400 ఎంఎల్ ప్రేటాల క్లోర్ , 25 రోజులలోపు వివాయ , నామిని గోల్డ్ వంటి మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతకుంట్ల యాకన్న వార్డు సభ్యులు బొల్లు మురళి, వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య కమ్యూనిటీ ఆర్గనైజర్ రవీందర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.