Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ఉపాధి హామీ పనుల పరిశీలన, బావి పూడ్చివేతకు రూ.25లక్షలు మంజూరు
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వరుసగా కురుస్తున్న వర్షాల రీత్యా ప్రజలకు ఎలాంటి నష్టం కలుగకుండా చూడాలని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. మండలంలోని సముద్రాల గ్రామంలో ఇటీవల రహదారికి పక్కనే ఉన్న మైసమ్మ బావి కూలి, రాకపోకలకు ఆటంకం ఏర్పడగా జెడ్పీ స్టాండింగ్ ఛైర్మన్ మారపాక రవి చొరవతో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆదేశానుసారం త్వరితగతిన అధికారులను అప్రమత్తం చేసి, బావి యజమానితో మాట్లాడి గ్రామ పంచాయతీకి విరా ళంగా ఇప్పించారు. తక్షణమే అధికారులను సమా యత్తపరచి పనుల్ని ప్రారంభించగా గురువారం మంత్రి, ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి అధికారులు, ప్రజాప్రతిని ధులు పనుల్ని పర్యవేక్షించారు. తొలుత ఇప్పగూడెం గ్రామంలో ఉపాధి హామీలో రోడ్డు వెంబడి మొక్కలు నాటుతున్న కూలీలతో కలిసి మాట్లాడారు. అధికా రులు సూచించిన విధంగా పని చేస్తే సరిపడా కూలీకంటే ఎక్కువగానే డబ్బులు వస్తాయన్నారు. గ్రామానికి అవసరమైన ప్రధాన రహదారి పూర్తిగా కుంగి పోగా, జీపి కి సహకరించిన బావి యజ మానులు ఇనుగాల సుధాకర్ రెడ్డి, నర్సింహ రెడ్డిని మంత్రి సన్మానించారు. జనగామ జిల్లాలో అనుకు న్నంత స్థాయిలో వర్షాలు కురవలేదని, పెద్ధగా నష్టమేమీ లేదని, అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. రహదారులు అక్కడక్కడ దెబ్బతిన్నాయని, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని రోడ్ల మర మ్మతులు చేపడతామని తెలిపారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురంలో ఎక్కువగా నష్టం జరిగిం దని, ప్రజలను అప్రమత్తం చేశామని, మహబూబ్ బాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఇండ్లు కూలిపోగా, ఆరు జిల్లాల్లో సుమారు 75 పాత ఇండ్లను కూల్చి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కోమటిగూడెం, రంగరాయి గూడెం గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ గూడెళ్లి అశోక్, ఎం.అనూష ఎంపీటీసీ శైలజ అజరు రెడ్డి, గ్రామస్థులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, ఆర్డీఓ క్రిష్ణ వేణి, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఎంపీపీ రేఖాగట్టయ్య, తహసీల్ధార్ పూల్ సింగ్, ఎంపీడీఓ కుమారస్వామి, సర్పంచ్ గుండె విమల నర్సయ్య, ఎంపీటీసీ పడిశాల సుగుణ వెంకటేష్, చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ బాబు, మండల అధ్యక్షులు మాచర్ల గణేష్, వారాల రమేష్, ఏఎంసీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, రాజ్‌కుమార్, సర్పంచ్ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగొద్దు
జనగామ : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆధ్వర్యంలో వరదల అంచనా, వర్షాల ప్రభావం, అధికారులు తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలకు అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం మెరుగు పరచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపడుతున్నామని, చీట కోడూరు రిజర్వాయర్ ను సందర్శించామని, ఓవర్ ఫ్లో లేకపోయినా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు జిల్లాలో పర్యటిస్తూ ప్రతి గంట గంటకు సమీక్షిస్తున్నామని, స్టేషన్ ఘన్పూర్ మండలంలో సముద్రాల గ్రామం వద్ద కూలిన బావి పూడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు కలెక్టర్లు భాస్కరరావు అబ్దుల్ హమీద్ జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడి రామ్‌రెడ్డి, డీపీఓ రంగాచారి, తదితరులు పాల్గొన్నారు.