Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని సింగారం గ్రామాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి బానోతు రాంజీ నాయక్ గురువారం సందర్శించి రైతులకు పంటల రక్షణఖు పలు సూచనలి చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారుల పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. పంటల రక్షణకొ మురుగు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోషక విలువల్ను ఎరువులు వాడాలన్నారు. మొక్కజొన్న మొలక దశలో నీటి ముంపును తట్టుకోలేదని, సాళ్ల మధ్య నీరు నిల్వ ఉండకుండా చేయాలని సూచించారు. మొక్కజొన్న పంట సాగు పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సురేష్, పూజిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.