Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా జాగ్రత్తలు పాటించాలని, మండలాధికారులు అప్రమ త్తంగా ఉండాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయిలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు భవనాల శాఖ అధికారులు ప్రమాదకరంగా ఉన్న రోడ్లను పర్య వేక్షించి సమస్యలు పరిష్కరించాలన్నారు. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే తరగతి గదుల పరిశీల తరువాతే విద్యార్థుల ప్రవేశం చేపట్టాలన్నారు. ఇండ్లు కూలిపోయినా ప్రమాదం జరిగినా వెంటనే ప్రజాప్రతినిధులకు, అధికా రులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అధికారులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండా లన్నారు. వాగులు, చెరువు అలుగుల వద్ద పోలిస్, రెవిన్యూ శాఖ బందోబస్తు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సూచించారు. ప్రజలు నీటి ప్రవాహాన్ని గమనించకుండా వాగులు దాటాకూడదని తెలి పారు. ఈ సమావేశంలో జెడ్పీ కోఆప్షన్ ఎండీ కాసిం, తాసిల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీఓ ప్రసాదరావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.