Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ ఎండీ. ఇక్బాల్
నవతెలంగాణ-భూపాలపల్లి
పలిమెల మండల ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని అందుబాటులో ఉండి ఆదుకుంటామని భూ పాల పల్లి తహసిల్దార్ ఎండి ఇక్బాల్ భరోసా ఇచ్చారు. వారం రోజులుగా భారీగా కురిసిన వానలకు నీట మునిగిన పలిమెల మండలానికి తహసీల్దార్‌ను కలెక్టర్ సహాయక అధికారిగా నియమించారు. మూడు రోజుల నుండి తా సిల్దార్ మండలంలో పర్యటిస్తూ పునరావాస కేంద్రాలలో ఉన్నటువంటి ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ముంపు ప్రాంతాలైనటువంటి పెద్దంపేట, సూరారం, సర్వాయిపేట, గ్రామాలకుభారీ ఎత్తున నిత్యావసర సరుకులు బియ్యం, చింతపండు, ఉప్పు, పప్పు, కారం, క్యాండిల్స్, వాటర్ బాటిల్స్, అందించారు.
వరద నీటిలో మునిగిన తాహసీల్దార్ కారు
మండలానికి తహసీల్దార్‌ను కలెక్టర్ సహాయక అధికారిగా నియమించారు. ముంపు గ్రామాల ప్రజలకు సేవ చేసే క్రమంలో తహసీల్దార్ కారు వరద నీటిలో మునిగింది. ఈ క్రమంలో గత గురువారం ఉదయం ఆయ న ముంపు గ్రామాలను పర్యటించే సందర్భంలో తన బెలోనో కారును సూరారం పెద్దంపేట గ్రామాల మధ్య పార్కింగ్ చేసి ముంపు గ్రామాల ప్రజల పరిస్థితులను తెలుసు కునేందుకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం కారు ఉన్న స్థలానికి రాగా కారు మొత్తం జలదిగ్బంధంలో ఉండి పోయింది. స్టార్ట్ కాకపోవడంతో వేరే వాహనంలో భూపా లపల్లికి చేరుకున్నారు సేవ చేయడానికి వచ్చిన కారు నీట మునగడంతో గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.