Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ క్రిష్ణఆదిత్య
నవతెలంగాణ-ఏటూర్ నాగారం(టౌన్)
వరద ముప్పు ప్రాంతాల ప్రజలందరూ వరదలు తగ్గేంతవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య తెలిపారు. శుక్రవారం ఐ టి డి ఏ సమావేశం గదిలో ఐటీడీఏ పీవో అంకిత్ తో కలిసి సమా వేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదా వరిలో వరద నీటిమట్టం 29 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు చేరిందన్నారు. గోదావరి వరద నీటిమట్టం రామ న్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 19 మీటర్లకు చేరిందని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తం గా లోతట్టు గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ జిల్లా అధికారులు, పోలీస్, సిఆర్పిఎఫ్, ఎన్ డి ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయన్నారు కన్నాయిగూడెం ,ఎటునాగారం, మంగపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఐదువేల మంది ముంపు ప్రాంత ప్రజలు ఉన్నారని వారికి మూడు పూటలా భోజనం, తాగునీరు వైద్య సదుపాయాలు కల్పిస్తూ శాని టైజర్ చేపించడం జరుగుతుందన్నారు. వరదలతో ఎక్క డైతే రోడ్లు నీట మునగాయో ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పోలీస్ ,రెవెన్యూ సిబ్బంది ద్వారా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు . ప్రజలకు అత్య వసర రక్షణ కోసం స్పీడ్ బోట్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో వారికి అన్ని విధాల సదుపాయాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంకా వరద పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఏపీ ఓ వసంతరావు పాల్గొన్నారు.