Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ-నర్సంపేట
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టి మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ఆరభంమై రెండు నెలలు కావస్తున్నా రైతులకు పంట రుణాలు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ఒక వైపు వేల కోట్ల రుణాలను రైతులకు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెపుకుంటుందని ఆచరణలో బ్యాంక్‌ల్లో రుణాలు అంద జేసిన దాఖలాలు లేవన్నారు. పంటలపై పెట్టుబడులు దొరక్క ప్రయివేటు వడ్డీ వ్యాపారుల చుట్టు తిరుగుతూ నష్టపోతున్నారని బ్యాంక్‌లు మాత్రం రైతులకు రుణాలను ఇవ్వకుండా నిరాకరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రుఊ. 1లక్షల్లోపు పంట రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చిందని ఇప్పటికీ ఏ ఒక్క రైతుకు మాఫీ చేసిందిలేదన్నారు. వెంటనే బ్యాంక్ అధికారులు స్పందించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను అందించాలని, రుణ మాఫీ చేసి ప్రభుత్వం తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిచారు. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముంజాల సాయిలు, రైతు సంఘం జిల్లా నాయకులు కట్కూరి శ్రీనివాసరెడ్డి, మహిళా సంఘం జిల్లా నాయకురాలు, గుజ్జుల ఉమ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు హన్మకొండ ఆనందం, నాయ కులు హన్మకొండ సంజీవ, సింగారపు బాబు, యాకయ్య, కత్తి కట్టయ్య, కష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.