Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలదిగ్బంధంలోనే మన్యం
- 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
- సురక్షిత ప్రాంతాలకు తరలింపు
నవతెలంగాణ-వెంకటాపురం
పధిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రకతి ప్రకోపం కారణంగా ఏజన్సీ ప్రజలపై గోదారమ్మ కన్నెర్ర చేసింది. గోదారి వరదల తో రోడ్లపైకి వచ్చిననీరు గోదా వరి వరద తగ్గకపోవడం తో రోడ్లపై నుంచి తొలగిపోలేదు. మూడురోజులుగా ఏజన్సీలో ని ఎనిమిది పంచాయితీ లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రెండు రోజులుగా ఆ గ్రామా లకు కరెంట్ సౌకర్యం లేకపోవడం తో అంధకారంలో ఉన్నాయి.చుట్టూ నీరు ఉన్నా త్రాగేందు నీరు లేక అల్లాడుతున్నారు.
పునరావసాల్లోనే..
గోదావరి వరద గ్రామాల చుట్టూ చేరడంతో ముంపుప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు నిర్వాసితులను తరలించారు. ముంపుప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగ కుండా మండల కేంద్రంలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల తో బాటు అలుబాక, మొర్రువాణీగూడెం, ఎదిరా పంచాయితీ ల్లో పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మండల తహ శీల్దార్ అంటి నాగరాజు, ఎంపిడివో బాబు లు పర్యy ేక్షిస్తున్నారు. వరద పరిస్థితి ని ఎప్పటి కప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. సాయంత్రానికి కొంత వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న ప్పటికి గిరిజన గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళనలోనే వున్నారు.
పునరావాస కేంద్రాల పరిశీలన
అధికారులు ఏర్పాటు చేసిన 4 పునరవాస కేంద్రాల్లో సుమారు1500 మందికి పైగా ముంపుప్రాంతాల ప్రజలు వుంటున్నారు. మండల కేంద్రంలో చిరుతపుల్లి ఆశ్రమ పాఠ శాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీ కొండపర్తి సీతాదేవి లు పరి శీలించారు. వారికి అందిస్తున్న ఆహార మెనూ ఆడిగితేలు కున్నారు. కల్పించిన సౌకర్యాల పై అరా తీశారు.