Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలి
- ప్రజాసంఘాల నాయకులు బాపు, కిరణ్
నవతెలంగాణ-మల్హర్రావు
భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను, వరదల్లో కొట్టుకపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ మోటార్లు, స్తంభాలకు మరమ్మతులు, వర్షానికి కూలిన ఇండ్లు, ఇంటి గోడల బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్, పీక కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మం డలంలోని కొయ్యూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో వివిధ జిల్లాలలో 20 లక్షల ఎకరాలకు పైగా నష్టం జరిగిం దన్నారు. నష్టం జరిగిన పంటలు పత్తి, వరి, సోయాబీన్, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, తదితర పంటలు ఎక్కువగా నీట మునిగి నష్టపోయాయని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో వరి పత్తి పంట లక్షలాది ఎకరాల్లో నీట మునిగిందన్నారు. వర్షాల వల్ల భూపాలపల్లి, ములు గు జిల్లాల్లో వరి నార్లు, పత్తి మునిగి వరదల్లో కొట్టుకు పోయాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాల వల్ల నార్లు దెబ్బతిన్నాయ,(దున్నిన) చదును చేసిన భూములు నెర్రెలు ఇచ్చి గండ్లు పడ్డాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నష్టాన్ని రైతుబంధు తో ముడిపెట్టి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని, రైతు బంధును సర్వరోగ నివారిణిగా ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రైతు సమస్యలు, ఇతర సబ్సిడీలను,మూడేళ్లగా పంట నష్టపరిహారంలపై పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.20 వేల నష్ట పరిహారం ఇవ్వాలని కేంద్ర రా ష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో గడ్డం సమ్మరాజు, గడ్డం లచ్చన్న. ఎడ్ల రాములు, పాల్గొన్నారు.