Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు మత్తడిని చూడడానికి పర్యటకుల తాకిడి ఎక్కువైంది. మత్తడిని పరిశీలించేందుకు తండోప తండాలుగా పర్యటకులు చూసి అబ్బుర పడు తున్నారు. శుక్రవారం వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పరిశీలించారు. చెరువు ముత్తడితో రైతులకు మూడు పంటలకు డోకా లేదని కొనియాడారు. ఆమె వెంట సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, మంద అశోక్‌రెడ్డి, నాయకులు మోతే కరుణాకర్ రెడ్డి, గుజ్జ గంగాధర్ రావు, అప్పయ్యపల్లి ఇన్చార్జి సర్పంచ్ సదయ్య తదితరులు ఉన్నారు.