Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
నవతెలంగాణ-జనగామ
ప్రభుత్వ ఆస్పత్రిలో పదలకు మెరుగైన వైద్యంతోపాటు, సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు చెంపక్హిల్స్లోని మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిని సందర్శించి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడే రక్త పరీక్షలు నిర్వహించడంతోపాటు స్కానింగ్ టెక్నీషియన్లు నియమించి సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్లు శస్త్రచికిత్స కోసం పరికరాల సరఫరా ఆగిపోయిందని చెప్పారు. గైనకాలజిస్టుల సంఖ్య తక్కువ ఉందని, రిక్రూట్మెంట్ చేసుకోవాలని కోరారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన పరికరాలు ఆస్పత్రి నిధుల నుండి కొనుగోలు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మరికొంతమందిని గైనకాలజిస్టును నియమించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎంసీహెచ్ లో ప్రసూతి అయిన కొంతమందిక కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుధాకర్ రాజు, డాక్టర్లు శ్రీనివాస్, డాక్టర్ శంకర్, డాక్టర్ స్వప్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.