Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ప్రజలకు నాణ్యమైన వైద్యం అం దించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ ఆదేశాలత ోఆయన శుక్రవారం ములుగు ఆసుపత్రిని సందర్శించారు. ఇందులో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, జి ల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ని కలిసి, టీ హబ్ కు కావ లసిన రెండు వాహనాల గురించి, ఆశ కార్యకర్తలకు రాత్రి వేళలో ఉండేందుకు వసతి రూమ్ గూర్చి చర్చించారు. జ్వరాల కేసులను ప్రతిరోజు సాయంత్రం ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చిన టువంటి వాటి వివరాలను తెలియ పర చాలని కోరారు. ఈ వివరాలను ఐడిఎస్పి మానిటరింగ్ సూపర్వైజర్ సిహెచ్ఓ దుర్గారావు కి 9346442529 కి అందిం చాలని తెలిపారు. అనంతరం ప్రధాన ఆసు పత్రిలోని లేబర్ రూమ్, ఐసీయూ, గర్భి ణీలను అవుట్ పేషంట్ పరీక్షించు గదిని, సాధారణ పేషంట్లను పరీక్షించు గదులను తనిఖీ చేసి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. వార్డులో ఉన్న వైద్య సిబ్బందికి డాక్టర్లకు నాణ్యమైన వైద్య సదుపాయం ప్రజలకు అందించాలని కోరారు.