Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలావరంగల్
ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే రూ.1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం బిజెపి నాయకులు గంట రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆటో డ్రైవర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లక్ష సంతకాల సేకరణలో భాగంగా తాడు అధికార ప్రతినిధి ఇమ్మడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఆయనను శివనగర్ లోని స్వగృహంలో కలిసి మద్దతు కోరారు. దీంతో గంటరవికుమార్ సంతకం చేసి ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు.. కార్యక్రమంలో నాయకులు సత్తు అంజన్న, కంచి మనోహర్, మేకల రవీందర్, దార సూరి, సార మహేందర్, ఎండి అన్వర్, మస్కే కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.