Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బ్యాంకుల ఎదుట ధర్నా
నవతెలంగాణ-జఫర్గడ్
రైతులకు పంట రుణాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బ్యాంకు మేనేజర్లకు అందించారు. ఈ సందర్భంగా రాపర్తి సోమయ్య మాట్లాడుతూ... వానాకాలంసాగు ప్రారం భమై నెలరోజులు గడుస్తున్నదని, ఇంతవరకూ బ్యాంకులు ప్రకటించిన రుణ ప్రణాళికను అమలు చేయలేదని విమర్శిం చారు. వ్యాపార రంగంలో 40శాతం వ్యవసాయ రుణాలు బ్యాంకులివ్వాలని, అందులో 18శాతం పంట రుణాలు, 22శాతం దీర్ఘకాలిక రుణాలివ్వాలనే నిబంధనలు ఉన్నాయ న్నారు. రుణాల మొత్తంలో 15శాతం దళిత, గిరిజనులకు విధిగా ఇవ్వాలని ఉన్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీగానీ, జిల్లా స్థాయిలో జరుగుతున్న బ్యాంకర్ల సమావేశాలు ఈ విషయా లను పాటించడంలేదని అన్నారు. రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పంట రుణాలకు వానాకాలం రూ.51,230 కోట్లు ప్రకటించారని, ఆచరణలో పంపిణీ కావడంలేదని అన్నారు. రైతుబంధు నిధులను, ధాన్యం డబ్బులను బ్యాంకులు రైతులకు ఇవ్వకుండా బాకీల కింద పెట్టుకుంటున్నారని అన్నారు. వెంటనే రైతులకు పంట రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి నక్క యాకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాట సుధాకర్, గుండెబోయిన రాజు, ఐద్వా జిల్లా నాయకురాలు ఎండీి షబానా, ఎండీ శంషుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండల కేంద్రంలోని బ్యాంకు వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి వివిధలి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బ్యాంకు మేనేజర్‌కు అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగాపురం మహేందర్, రజక సంఘం జిల్లా అద్యక్షులు మైలారం వెంకటేశ్వర్లు, తెలం గాణ రైతు సంఘం మండల నాయకులు కాసాని పుల్లయ్య పాల్గొని మాట్లాడారు. సులగల రవి, ఇంజె వెంకటస్వామి, బంద రవీందం, గజుల గట్టయ్య, నలకపల్లి దాలిన్సంగ, పాక పోశయ్య, కురెళ్ళ ఐలయ్య కురెళ్ళ నర్సెల్లయ్య పాల్గొన్నారు.
పాలకుర్తి : ఏకకాలంలో రైతులకు లక్ష రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాచర్ల సారయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఎదుట రైతులు ధర్నా నిర్వహించి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బ్యాంకు మేనేజర్ సింధూషకు అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమ సత్యం, ప్రజా సంఘాల నాయకులు బానోత్ కిషన్ నాయక్, బెల్లి సంపత్, రాచూరి రాజు, బక్క నరసయ్య, గుర్రం సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.